Breaking News

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. రీజినల్ మేనేజర్ ఎస్‌వీజీ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించగా, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు జాతీయగీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రజా పాలన ఆవిర్భావం, దేశ సమైక్యత, ప్రజాసేవ ప్రాధాన్యతపై ప్రసంగించారు….

Read More

డయల్ 112కు తక్షణ స్పందన.. వ్యక్తికి కౌన్సెలింగ్

మద్నూర్, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) భార్యతో గొడవ కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు సమాచారం అందించిన వ్యక్తికి పోలీసులు తక్షణ స్పందించి మనోధైర్యం కల్పించారు. డోంగ్లి మండలం మోఘా గ్రామానికి చెందిన ధన్నూరే హుల్లప్ప (35) భార్యతో గొడవ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు కాల్ చేశాడు. సమాచారం అందుకున్న మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు చ….

Read More

తాత వారసురాలిగా రాజకీయాల్లోకి డాక్టర్ వనమా అలేఖ్య?

బీఆర్‌ఎస్‌లో అరంగేట్రంపై కొత్తగూడెంలో ఆసక్తికర చర్చ కొత్తగూడెం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). కొత్తగూడెం రాజకీయాల్లో వనమా కుటుంబ వారసత్వం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుటుంబం నుంచి డాక్టర్ వనమా అలేఖ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం స్థానిక రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 16న వెలువడిన ఒక స్థానిక రాజకీయ కథనం కూడా అలేఖ్య పేరు తెరపైకి వచ్చినట్లు, అయితే ఆమె రాజకీయ అరంగేట్రంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదని పేర్కొంది….

Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్‌లో భాగంగా కార్యక్రమం 14 పాఠశాలల్లో 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు 170 మందికి ఉచిత మందులు.. అనంతరం అద్దాల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ తరఫున చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్…

Read More

అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: మంత్రి సవితమ్మ

కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదుసూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాంపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)  నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. పెనుకొండ…

Read More

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

భీంగల్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: ప్రతినిధి). టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్…

Read More

సమ్మెకు సిద్ధమైన పవర్ జేఏసీ

పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) విద్యుత్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంపై పవర్ జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యుత్ యాజమాన్యాల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు పవర్ జేఏసీ వెల్లడించింది. సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని 1104 కార్యాలయంలో జరిగిన విద్యుత్ జేఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో పవర్ ఎంప్లాయీస్…

Read More

బిందెల కాలనీ భూ సమస్యపై 17న ప్రజా ధర్నా

అనంతపురం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). బిందెల కాలనీలోని సర్వే నంబర్లు 189/3, 75లో ఉన్న భూముల సమస్యపై దాదాపు 22 నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజా ఉద్యమ నేత సాకే గోవింద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పేదల స్థలాలను కాపాడాలని, అక్రమ జోక్యాలను అడ్డుకోవాలని, వాస్తవ రికార్డులను…

Read More

ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్ చోరీ.. ముగ్గురు అరెస్ట్

178.5 కిలోల కాపర్ వైర్ స్వాధీనం.. విలువ రూ.3.57 లక్షలు టేకులపల్లి, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైర్‌ను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుంచి 178.5 కిలోల కాపర్ వైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 లక్షల 57…

Read More

అడవి సిరికి.. ఆన్‌లైన్‌ దారి!

ఆదివాసి ఉత్పత్తులకు డిజిటల్‌ రెక్కలు.. ఇంటికే గిరి ఉత్పత్తులు భద్రాచలం, సెప్టెంబర్‌ 15:(E6tv NEWS: ప్రతినిధి) అడవిలో పండిన ఉత్పత్తులకు గిరిజనుల చేతుల మీదుగా విలువ జోడించి.. వాటిని దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ చేసేందుకు భద్రాచలంలోని భద్రగిరి మార్ట్‌ మరో ముందడుగు వేసింది. గిరిజనుల శ్రమకు సరైన గిట్టుబాటు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించే లక్ష్యంతో మార్ట్‌ను పర్యాటక రంగంతో అనుసంధానం చేసి, ఆన్‌లైన్‌ విక్రయాలకు శ్రీకారం చుట్టారు. అడవి ఉత్పత్తులకు ‘భద్రగిరి…

Read More