Mahaboobnagar
మోర్తాడ్‌లో పోషణ మాసం కార్యక్రమం
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన మోర్తాడ్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎస్సీ సంఘం భవనంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ, వేల్పూర్, భీంగల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కార్యక్రమానికి హాజరై పోషకాహార స్టాళ్లను సందర్శించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి,…
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజల వినతులను ఓపికగా విన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్…
గిరిజన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్, సెప్టెంబర్ 15: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు హన్మంత్ షిండే ఆరోపించారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి,…
చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పరామర్శ
నిజామాబాద్:, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్ను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆకాంక్షించారు.
పెద్ద ఏక్లారాలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
పెద్ద ఏక్లారా, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన గ్రామ ప్రజలకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కార్యక్రమంలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి…
వినాయక చవితి వేడుకల్లో శ్రీనివాస్ పటేల్ కుటుంబం
మద్నూర్, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి).వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పుష్పాలు, పండ్లు, నైవేద్యాలను సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి గణేశుడికి హారతి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పటేల్ కుటుంబంలో భక్తి వాతావరణం నెలకొంది. విఘ్నాలను తొలగించి కుటుంబ సభ్యులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు,…
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయిమాస్కులు ధరించి దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి– మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిసెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). సెప్టెంబర్ 14: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌లను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ సమావేశాల…
ధర్మవరం పర్యటనలో మంత్రి సత్యకుమార్ యాదవ్
సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ధర్మవరం, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం పర్యటన వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు, ఎన్డీఏ కూటమి నాయకులు,…
పండుగలు ఐకమత్యానికి వేదికగా నిలవాలి
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్వంచ, సెప్టెంబర్ 14:(E6tv NEWS: ప్రతినిధి) పండుగలు ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించే వేదికలుగా నిలవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా పాల్వంచ పట్టణ పరిధిలో వివిధ గణేష్ ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన మండపాలను సోమవారం ఎమ్మెల్యే సందర్శించి, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…
మనుషుల మెదళ్లను దున్నాలి.. అప్పుడే సమాజంలో నిజమైన మార్పు
– సామాజిక రాజకీయ విశ్లేషకుడు వడ్డేపల్లి మల్లేశం. E6tv NEWS-ప్రత్యేక కథనం. సమాజంలో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు, విద్య, వైద్యం, సాంకేతిక రంగాల అభివృద్ధి మాత్రమే కాదని.. మానవ వికాసం, మానవీయ విలువలు, ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే నిజమైన సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని సామాజిక రాజకీయ విశ్లేషకుడు వడ్డేపల్లి మల్లేశం పేర్కొన్నారు. “ఇప్పుడు పొలాల కంటే మిన్నగా మనుషుల మెదళ్లను దున్నాలి” అనే ఆలోచనను సమాజం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో…

