Breaking News

పవన్ కల్యాణ్ రాజీనామా చేస్తున్నారంటూ ఫేక్ ప్రచారం… పోలీసులకు జనసేన ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం రాజకీయంగా కలకలం రేపింది. ‘డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్’ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఒక నకిలీ వాట్సప్ ఛానెల్‌ను సృష్టించి, పవన్ కల్యాణ్ రాజీనామా చేయబోతున్నారంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు.

ఈ ఫేక్ ఛానెల్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని డిప్యూటీ సీఎంవో స్పష్టం చేస్తూ ‘ఎక్స్’ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈ కుట్ర వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తూ జనసేన నాయకులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలను నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పోలీసులు, ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్న కేటుగాళ్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *