Breaking News

పవన్ కల్యాణ్:నేడు సమన్వయ కమిటీలతో కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పార్టీ కోఆర్డినేషన్ కమిటీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలాబలాలను సమీక్షించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల కార్యాచరణ, కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం, ప్రచార వ్యూహాలపై పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంలో గ్రామాలు, మండలాల వారీగా రాజకీయ పరిస్థితులను ఆరా తీయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, కూటమి నేతల మధ్య ప్రాథమిక సమన్వయంపై స్పష్టమైన ప్రణాళికను రూపొందించనున్నారు. ఇప్పటికే సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన జనసేన, ఈ భేటీ ద్వారా ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కల్యాణ్ ఎలాంటి సూచనలు ఇస్తారనే దానిపై జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *