Breaking News

వాకాడులో బీజేపీ మండల సమావేశం

తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో బిజెపి మండల అధ్యక్షుడు తూపిలి చంద్రారెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అధికారులు బిజెపి కార్యకర్తలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి విజయం కోసం కష్టపడిన బిజెపి శ్రేణులను పట్టించుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల, పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇలాగే వ్యవహరిస్తే టీడీపీ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని కోటేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పామంచి కృష్ణయ్య, కాలవల్లి ప్రసాద్, వాకాటి సంపత్ కుమార్, ఇరుగు శ్రీనివాసులు, రాము, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *