Breaking News

ఈ నెల 14న ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడ (e6tv news): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. విజయవాడలో అక్టోబర్ 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనుండటం, సుమారు 20 నుండి 25 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్న తరుణంలో రాష్ట్రపతి పర్యటన ఖరారైంది. ఈ…

Read More

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత

మేయర్ ఎన్నికల్లో 35.29 శాతం రిజర్వేషన్లు – మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి అమరావతి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీలకు కల్పించనున్న రిజర్వేషన్ల శాతాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని…

Read More

పుట్టపర్తిలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం

రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ పుట్టపర్తి, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలికి నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి సచివాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం…

Read More

విజయవాడలో వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్!

విజయవాడ (e6tv news): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేయడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి పిలుపునిచ్చిన ‘చలో రాజ్‌భవన్’ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా అర్హులైన వారి పేర్లు తొలగించారని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ…

Read More

ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి ఫిర్యాదు

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విపక్ష నేతలు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: (E6tv NEWS). ఎన్నికల సంఘంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ మేరకు ఎన్నికల సంఘంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా…

Read More

ఏపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు రూ.25 లక్షల టోకరా!

తమది కాని భూమిని తమదిగా నమ్మించి మోసం చేసిన తండ్రీకొడుకులు భూమి విక్రయిస్తామంటూ అడ్వాన్స్ తీసుకుని మోసం.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఎమ్మెల్సీ ఫిర్యాదు హైదరాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యను భూమి కొనుగోలు వ్యవహారంలో మోసగించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డులో తమకు 5.5 ఎకరాల భూమి ఉందని నమ్మించి, విక్రయిస్తామంటూ రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏపీ…

Read More

అరకు పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడిగా మజ్జి శ్రీనివాసరావు

అమరావతి (e6tv news): వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరిశీలకుడిగా (అబ్జర్వర్‌) ఆయన్ను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే…

Read More

నంద్యాల పోలీస్ స్టేషన్‌లో పుట్టినరోజు వేడుకలు.. వైరల్ వీడియోపై చర్చ

పోలీస్ స్టేషన్ ఆవరణలో బాణసంచా కాల్చినట్లు ప్రచారం.. పోలీసు అధికారితో కేక్ కటింగ్‌పై విమర్శలు నంద్యాల, అక్టోబర్10:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాలలోని ఓ పోలీస్ స్టేషన్ ఆవరణలో టీడీపీ నాయకులు వేడుకలు నిర్వహించినట్లు చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బాణసంచా కాల్చినట్లు,…

Read More

మానవత్వం చాటుకున్న చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ

గర్భిణీలకు సొంత ఖర్చులతో పౌష్టికాహారం.. వైద్య సిబ్బందికి భోజన వసతి చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 09 (E6 NEWS: ప్రతినిధి). ఖాకీ దుస్తుల వెనుక కఠినమైన పోలీసు విధులే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవత్వం కూడా ఉంటుందని చెన్నేకొత్తపల్లి ఎస్ఐ ఎస్. సత్యనారాయణ నిరూపిస్తున్నారు. విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్.ఎస్. గేట్ ప్రాథమిక ఆరోగ్య…

Read More

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం పెద్దపల్లి, అక్టోబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా…

Read More