Andhra Pradesh
2,721 టీచర్ పోస్టులతో ఏపీ డీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ డీఎస్సీ (AP DSC 2026) ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ప్రకటించారు. మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులతో ఈ నోటిఫికేషన్ వెలువడగా, ఇందులో ప్రత్యేకంగా దివ్యాంగులు/ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 350 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కేటాయించినట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర (Detailed) నోటిఫికేషన్‌ను నవంబర్ 3 లేదా అంతకంటే ముందే విడుదల చేయనున్నట్లు…
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..
మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేసిన వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రామ సభల తీర్మానాలు తీసుకోకుండా, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా ఏకపక్షంగా గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. ఈ విలీన ప్రక్రియ అంతా తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఏపీ-తమిళనాడు సీఎంల సమావేశం
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం విజయవాడలో పర్యటించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం విజయ్.. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చర్చలు జరపగా.. తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా చెన్నై నగరానికి తాగునీటిని అదనంగా…
విజయవాడ చేరుకున్న సీఎం విజయ్!
విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయ్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు, ఏపీ ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటన వివరాలు & కీలక ముఖ్యాంశాలు:
నామినేటెడ్ నేతలకు గుడ్‌న్యూస్: పదవీకాలం పెంపు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారి పదవీకాలాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న ఛైర్మన్లు, డైరెక్టర్లు మరికొంత కాలం తమ పదవుల్లోనే కొనసాగనున్నారు. కీలక వివరాలు: ప్రభుత్వ నిర్ణయంపై వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఈ…
విజయవాడలో రాష్ట్రపతి 2 రోజుల పర్యటన!
దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పర్యటించనున్నారు. ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ, రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సంబంధిత అధికారులతో వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ వివరాలు:
సీఎం విజయ్ పర్యటన:కనకదుర్గ ఆలయం వద్ద హై-సెక్యూరిటీ
విజయవాడ ఇంద్రకీలాడ్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గ మల్లే్వర స్వామి వార్ల దేవస్థానాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సందర్శించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల వేళ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాడ్రిపై పోలీసులు అత్యంత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీఎం విజయ్ పర్యటన షెడ్యూల్ వివరాలు:
ఏపీకి సీఎం విజయ్: చంద్రబాబుతో భేటీ!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈరోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు కింద కృష్ణా జలాల విడుదల, గోదావరి-కావేరి నదుల అనుసంధానం వంటి కీలక అంతర్రాష్ట్ర జలవివాదాలు, ప్రాజెక్టుల పురోగతిపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి విజయ్ పర్యటన షెడ్యూల్: తమిళనాడు సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఏపీ:కొలిక్కిరాని కూటమి సీట్ల పంచాయితీ!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాల కేటాయింపుపై పార్టీల మధ్య పీటముడి పడటంతో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత పి.వి.ఎన్. మాధవ్ మధ్య సుమారు రెండు గంటలకు పైగా సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ తుది నిర్ణయానికి రాలేకపోయారు. ముఖ్యంగా కీలకమైన…
జాతీయ స్థాయిలో శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పుట్టపర్తి, అక్టోబర్ 12 (E6 TV న్యూస్). వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులకు సకాలంలో బ్యాంకు రుణాల పంపిణీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ సత్యసాయి జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (NASC)లో సోమవారం నిర్వహించిన ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (PMDDKY) జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవంలో…

