Breaking News

ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనపై ఇరాన్ హస్తం ఉందంటూ ట్రంప్ !

గత నెల 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో జరిగిన కత్తిపోట్ల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉండవచ్చని వైట్‌హౌస్ ప్రెస్ మీట్‌లో అనుమానం వ్యక్తం చేశారు. ఒమన్‌కు చెందిన కో-పైలట్‌కు ఇరాన్‌‌తో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని, దర్యాప్తులో గనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు తేలితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

కాక్‌పిట్‌లో కో-పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా, గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడి వెనుక తీవ్రవాద భావజాలం ఉందా అనే కోణంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *