Breaking News

‘అర్నబ్’ తుపాను ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే!

ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ‘అర్నబ్’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన.. కృష్ణా, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తుపాను సృష్టించిన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. మార్గమధ్యంలో నీట మునిగిన వరి పొట్లు, దెబ్బతిన్న అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా కల్చర్ చెరువుల పరిస్థితిని సీఎం స్వయంగా వీక్షించారు.

నిమకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోమ తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను, నేలకూలిన కొబ్బరి చెట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. బాధితులకు అందజేయాల్సిన సహాయక చర్యలు, పంట నష్టం అంచనాలపై సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న వివిధ ప్రాంతాల వివరాలను చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వివరించారు. తుపాను నష్టంపై పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకుని, రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *