చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రైవేటు పూల మార్కెట్‌లో కనీస వసతులు లేకపోవడం, సరైన వేలం ప్రక్రియ నిర్వహించకుండా తక్కువ ధరలకు పూలను కొనుగోలు చేస్తుండటంతో ఆగ్రహించిన పూల రైతులు మార్కెట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పూల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జీఎం రాజు, టీడీపీ నేతలు రైతులతో చర్చలు జరిపారు. కుప్పం పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు ఎకరాల స్థలంలో, రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ పూల మార్కెట్‌ను ఏర్పాటు చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని నాయకులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
కుప్పంలో పూల రైతుల ధర్నా..మార్కెట్ ఏర్పాటుకు హామీ!

