టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను తిరిగి నియమించడంపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో అజెండాలో స్పష్టమైన ముందస్తు సమాచారం లేకుండానే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, ఇది నిబంధనలకు విరుద్ధమని కంపెనీ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఏర్పాటు కానీ, దాని ప్రతిపాదన కానీ లేకపోవడం వల్ల ఈ తీర్మానం చెల్లదని ఆయన స్పష్టం చేశారు. అలాగే బోర్డు సమావేశం ఆడియో, వీడియో రికార్డింగులతో పాటు ధృవీకరించిన ప్రతిని తనకు అందించలేదని, మినిట్స్ ఖరారు కాకుండానే వివరాలను మీడియాకు మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఏడు రోజుల్లోగా సంబంధిత పత్రాలను అందించాలని మరియు తుది నిర్ణయం తేలేవరకు ఈ తీర్మానంపై తదుపరి చర్యలను నిలిపివేయాలని నోయల్ టాటా డిమాండ్ చేశారు.
టాటా సన్స్ ఛైర్మన్ నియామకంపై నోయల్ టాటా సవాల్

