Breaking News

నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించనున్నారు. ముఖ్యంగా రానున్న జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు, నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పరిస్థితులపై రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదికలు స్వీకరించి, వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా రేపు (రెండో రోజు) అమిత్ షా తూప్రాన్‌పేట్, కరీంనగర్‌‌లలో పర్యటించి పలు బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగనున్న ఆయన పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజపా వ్యూహాలు రచిస్తున్న తరుణంలో అమిత్ షా పర్యటన రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *