Breaking News

చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో నవతరం పార్టీ నామినేషన్

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలక సంఘ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి నవతరం పార్టీ అభ్యర్థిగా రావు రామ తులసి శనివారం తొలి నామినేషన్‌ను అత్యంత ఉత్సాహంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లుకు తన నామినేషన్ పత్రాలను (ఒక సెట్) అధికారికంగా అందజేశారు. ప్రధాన పార్టీలకు ధీటుగా నవతరం పార్టీ కూడా చైర్‌పర్సన్ రేసులో నిలవడం, అందరికంటే ముందే…

Read More

రాయచోటిలో పంజాబ్ గ్యాంగ్ అరెస్ట్… పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య వరుసగా రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఒక కారు ధ్వంసం కాగా, వైఎస్సార్‌సీపీ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లను రప్పించి గొడవలను తీవ్రతరం చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు పంజాబ్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి…

Read More

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. కూటమి పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా విడుదల చేసింది. కీలక అభ్యర్థుల ప్రకటన: కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీ మొత్తం 4 కార్పొరేషన్లు (శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ), 21 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను త్వరలోనే…

Read More

ఏపీలో మరో 4 రోజులు వర్షాలు: వాతావరణ శాఖ గుడ్ న్యూస్!

ఎల్‌నినో ప్రభావంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విజయనగరం నుంచి తిరుపతి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలవారీగా వర్ష…

Read More

మహాలక్ష్మి అలంకారంలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తాగునీరు, ఇతర…

Read More

బయ్యన్నగూడెంలో ఇంట్లోనే కుటుంబం ఉండగా ఇల్లు కూల్చివేత

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే తమ ఇంటిని కూల్చివేశారంటూ ఎడ్లపల్లి సోమరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పుల జాన్ అనే వ్యక్తి తమ ఇంటిని కూల్చివేయడమే , ఇంట్లోని గృహోపకరణాలను సైతం ట్రాక్టర్‌పై తరలించుకుపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, బాధితుల ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర విచారణ…

Read More

నామినేషన్ల వేళ ఉద్రిక్తత:వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రాళ్ల దాడి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, రాయచోటిల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. రాయచోటిలో కొందరు ఆగంతకులు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు వేసేందుకు వెళ్తుండగా, టీడీపీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డుకుని దాడికి పాల్పడ్డాయని వైఎస్సార్‌సీపీ…

Read More

మున్సిపల్ స్థానాలకు నేటి నుంచే నామినేషన్లు!

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలతో పాటు మొత్తం 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల పోరుకు వేదిక సిద్ధం కావడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00…

Read More

రాష్ట్రపతికి మంగళగిరి చీర, ఏటికొప్పాక బొమ్మలు అందజేసిన లోకేశ్

విజయవాడ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రపతికి శాలువాతో స్వాగతం పలికి సత్కరించారు. మన కళాకారుల వారసత్వానికి ఈ కానుకలు గర్వకారణమని పేర్కొన్న లోకేశ్, రాష్ట్రపతిని కలవడం ఎంతో గౌరవంగా ఉందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Read More

వర్ష సూచన: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడనున్న వాతావరణం

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత వారం రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు అందించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే ఛాన్స్…

Read More