Andhra Pradesh
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: మంత్రి సవిత
పెనుకొండ, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి) చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సవిత విద్యార్థినులకు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలోని ఎం.జె.పి. బాలికల పాఠశాలను మంత్రి సవిత సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, ఇతర సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థినులు వివిధ క్రీడల్లో పాల్గొంటున్న తీరును స్వయంగా వీక్షించారు. విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించిన మంత్రి.. వారి…
సేవా సంకల్ప అభియాన్‌లో పలు సేవా కార్యక్రమాలు
తనకల్లు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండల కేంద్రంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.తనకల్లు మండల బాలికల గురుకుల కళాశాలలో చిత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీ తాండ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…
గాయపడిన గర్భిణి జింక.. కాపాడిన స్థానికులు!
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో మానవత్వం పరిమళించిన ఘటన చోటుచేసుకుంది. ఇటీవలి భారీ వర్షాల కారణంగా అడవి నుంచి దారి తప్పి పొలాల మీదుగా గ్రామంలోని ఎస్సీ ఏరియాలోకి వచ్చిన ఒక చుక్కల జింకపై గ్రామ వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. కంచిలో చిక్కుకున్న జింకకు ప్రథమ చికిత్స: సుమారు 10 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో భయంతో పరుగులు తీసిన చుక్కల జింక సమీపంలోని కంచి (కంపచెట్లు) లో చిక్కుకుపోయింది. తీవ్రంగా…
ఏపీలో నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను రాబోయే నవంబర్ 1 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్‌లో మాట్లాడిన ఆయన, ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. 2,619 కొనుగోలు కేంద్రాలు – రైతులకే రవాణా ఖర్చులు: ఎల్‌నినో ప్రభావం ఉన్నా రైతుల…
‘నిధులు ఏమవుతున్నాయి?’.. అధికారులపై యాంకర్ రష్మి
ప్రముఖ నటి, యాంకర్ రష్మి గౌతమ్ మూగజీవాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు, ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జంతు సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను వ్యక్తిగతంగా ఎంత విమర్శించినా భరించేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ మూగజీవాల హక్కులు, వ్యవస్థలోని లోపాలపై మాత్రం ప్రశ్నించడం ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు. నన్ను తిట్టినా…
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
మంత్రి సవితమ్మకు వినతిపత్రం కొత్తచెరువు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏ సంఘం నాయకులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి మంత్రి సవితమ్మ వచ్చిన సందర్భంగా వీఆర్ఏలు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, నామినీలుగా…
అహ్మదాబాద్‌లో నారా లోకేశ్ ఆపరేషన్ ఇన్వెస్ట్మెంట్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్‌శాఖ మంత్రి నారా లోకేశ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తుఫాను పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌లోనే అత్యంత ప్రముఖ పారిశ్రామిక గ్రూపుల అధినేతలతో సమావేశమై, కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఏపీకి వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని సాధరంగా ఆహ్వానించారు. టోరెంట్ చైర్మన్‌తో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై చర్చ: టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్…
మాజీ మంత్రి అంబటికి ఈడీ మళ్లీ నోటీస్!
ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి తనకు వేరే తేదీ కేటాయించాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేయడంతో, ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించి ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో స్పష్టం చేశారు. అక్రమ రవాణా కాంట్రాక్టులపై ఆరా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్…
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళులు..
గానగాంధర్వుడు, పద్మవిభూషణ్ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీబీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎస్పీబీ: “తన మంత్రముగ్ధమైన గళంతో ప్రతి పాటకు ప్రాణం పోసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహోన్నత గాయకుడు…
వైఎస్ వివేకా హత్య కేసులో…విచారణకు సునీల్ యాదవ్!
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించి మనీలాండరింగ్, హవాలా కోణాల్లో ఆరా తీస్తున్న ఈడీ అధికారులు.. ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. తొలిరోజు 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు: గురువారం మొదటి రోజు విచారణలో భాగంగా ఈడీ అధికారులు…

