Andhra Pradesh
అంగన్వాడీ సిబ్బంది సేవలు అభినందనీయంఅంగన్వాడీ టీచర్లకు ఘన సన్మానం
బిచ్కుంద, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని బిచ్కుంద బీజేపీ మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు అన్నారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం దోబీవాడలోని అంగన్వాడీ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ.. చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య అందించడంలో అంగన్వాడీ…
జమ్మలమడుగులో మెగా మెడికల్ క్యాంపు ప్రారంభం
జమ్మలమడుగు, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం, పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఉత్సవాల్లో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోటరీ క్లబ్లో దేవగుడి శంకర్రెడ్డి, సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కడప జిల్లా ఇన్చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి…
తిరుమల శ్రీవారి దర్శనంలో మంత్రి లోకేష్.. వెంట సింగపూర్ మంత్రి!
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, సింగపూర్ కేంద్ర మంత్రి కె. షణ్ముగం మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం తో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శన ఏర్పాట్లపై సింగపూర్ మంత్రి షణ్ముగం హర్షం వ్యక్తం చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే ప్రపంచ ప్రసిద్ధ తిరుమల క్షేత్రంలో టిటిడి పరిపాలన, క్యూలైన్ల నిర్వహణ అత్యుత్తమంగా…
సొహ్రాబుద్దీన్ కేసు:సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన సీపీఐ నేత నారాయణ
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సొహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కింది కోర్టులు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని సీపీఐ సీనియర్ నేత కె. నారాయణ స్వాగతించారు. విచారణ సమయంలో ఏకంగా 92 మంది సాక్షులు మాట మార్చడంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ… సొహ్రాబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బీ, తులసీరామ్ ప్రజాపతి హత్యలపై సమగ్ర న్యాయ సమీక్ష జరగాలని డిమాండ్ చేశారు. ఇదే…
తిరుమలలో భక్తుల రద్దీ: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
పెరటాసి మాసానికి తోడు వరుస సెలవులు రావడంతో తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 1, అక్టోబర్ 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అయితే ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే ఈ రద్దు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అక్టోబర్ 1, 5 తేదీల బ్రేక్…
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతినిధి). డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గతంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ, పాత కొత్తగూడెం ప్రాంతాల్లో డబుల్…
అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు పునాదులు: మంత్రి సవిత
సోమందేపల్లి, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి). అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యతో పాటు వారి మానసిక, శారీరక అభివృద్ధికి పునాదులు వేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాసేవలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సేవా…
కరువు సహాయక చర్యలు చేపట్టాలి
లేపాక్షి, సెప్టెంబరు 28:(:E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ లేపాక్షి మండల కేంద్రంలో రైతులు, వ్యవసాయ కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో మహాధర్నాలో పాల్గొనాలని సీపీఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహప్ప…
అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలను పరిశీలించిన హరీష్ బాబు
ధర్మవరం, సెప్టెంబరు 28:(E6tv NEWS: ప్రతిని) ధర్మవరం పట్టణ ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్య సేవలు, ఆసుపత్రిలోని సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ బాబు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను హరీష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడంతో పాటు, చికిత్స కోసం వచ్చిన ప్రజలను…
చిత్తూరులో మళ్లీ ఏనుగుల భయం..అధికారులను అప్రమత్తం చేసిన పవన్ కల్యాణ్
అడవుల్లో ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల కదలికలు, ప్రజల భద్రతపై సోమవారం ఆయన అటవీశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవాసాల్లోకి వచ్చే ఏనుగులు మనుషులపై దాడులు చేయకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. ముఖ్యమైన ఆదేశాలు & ముఖ్యాంశాలు:

