Breaking News

ఏపీలో నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను రాబోయే నవంబర్ 1 నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్‌లో మాట్లాడిన ఆయన, ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. 2,619 కొనుగోలు కేంద్రాలు – రైతులకే రవాణా ఖర్చులు: ఎల్‌నినో ప్రభావం ఉన్నా రైతుల…

Read More

‘నిధులు ఏమవుతున్నాయి?’.. అధికారులపై యాంకర్ రష్మి

ప్రముఖ నటి, యాంకర్ రష్మి గౌతమ్ మూగజీవాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు, ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జంతు సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె పెట్టిన సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను వ్యక్తిగతంగా ఎంత విమర్శించినా భరించేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ మూగజీవాల హక్కులు, వ్యవస్థలోని లోపాలపై మాత్రం ప్రశ్నించడం ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు. నన్ను తిట్టినా…

Read More

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

మంత్రి సవితమ్మకు వినతిపత్రం కొత్తచెరువు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏ సంఘం నాయకులు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి మంత్రి సవితమ్మ వచ్చిన సందర్భంగా వీఆర్ఏలు ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించాలని, నామినీలుగా…

Read More

అహ్మదాబాద్‌లో నారా లోకేశ్ ఆపరేషన్ ఇన్వెస్ట్‌మెంట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్‌శాఖ మంత్రి నారా లోకేశ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తుఫాను పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌లోనే అత్యంత ప్రముఖ పారిశ్రామిక గ్రూపుల అధినేతలతో సమావేశమై, కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఏపీకి వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని సాధరంగా ఆహ్వానించారు. టోరెంట్ చైర్మన్‌తో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై చర్చ: టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్…

Read More

మాజీ మంత్రి అంబటికి ఈడీ మళ్లీ నోటీస్!

ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి తనకు వేరే తేదీ కేటాయించాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేయడంతో, ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించి ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో స్పష్టం చేశారు. అక్రమ రవాణా కాంట్రాక్టులపై ఆరా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్…

Read More

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళులు..

గానగాంధర్వుడు, పద్మవిభూషణ్ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీబీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎస్పీబీ: “తన మంత్రముగ్ధమైన గళంతో ప్రతి పాటకు ప్రాణం పోసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహోన్నత గాయకుడు…

Read More

వైఎస్ వివేకా హత్య కేసులో…విచారణకు సునీల్ యాదవ్!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించి మనీలాండరింగ్, హవాలా కోణాల్లో ఆరా తీస్తున్న ఈడీ అధికారులు.. ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. తొలిరోజు 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు: గురువారం మొదటి రోజు విచారణలో భాగంగా ఈడీ అధికారులు…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న చెన్నారెడ్డికి పరామర్శ

పరిగి, సెప్టెంబర్ 25: (E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న చెన్నారెడ్డిని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పరామర్శించారు.ఈ సందర్భంగా చెన్నారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఉషశ్రీ చరణ్,…

Read More

క్రీడలకు ఆర్డీటీ మంచు ఫెర్రర్ ఒక వరం

క్రికెట్‌లో రాణించి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలి రాయదుర్గంలో క్రికెట్ సెలక్షన్స్‌కు భారీ స్పందన రాయదుర్గం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). కరువు నేల అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, ప్రతిభను వెలికితీసేందుకు ఆర్డీటీ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. క్రీడలకు ఆర్డీటీ, మంచు ఫెర్రర్ వంటి సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. క్రికెట్‌లో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికై…

Read More

PDSU నూతన డిగ్రీ కళాశాల కమిటీ ఏర్పాటు

17 మంది విద్యార్థులతో నూతన కమిటీ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: PDSU హిందూపురం, సెప్టెంబర్ 24:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాలలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాబావలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థులతో చర్చించిన అనంతరం 17 మంది విద్యార్థులతో నూతన డిగ్రీ కళాశాల కమిటీని…

Read More