Andhra Pradesh
భగత్ సింగ్ త్యాగం చిరస్మరణీయం: మంత్రి సవిత
పెనుకొండ, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి) దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ విగ్రహానికి మంత్రి సవితమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగం, ఆయన చూపిన ధైర్యం, నిస్వార్థ దేశభక్తి చిరస్మరణీయమని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన…
కొండచరియలు విరిగిపడి…మంచు కొండల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు:కేదార్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన 45 మంది యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ మార్గంలో గౌరీకుండ్ సమీపంలో సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో అక్కడే చిక్కుకుపోయారు. కేదార్నాథ్ స్వామివారి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చిర్బాసా సమీపంలో కొండచరియలు పడటంతో యాత్రకు వెళ్లే దారులు, కాలినడక మార్గాలు పూర్తిగా మూసుకుపోయి వేలాది మంది యాత్రికులు వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయారు. ప్రమాద తీవ్రత…
విజయవాడలో: సెప్టెంబర్ 30న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ!
విజయవాడ నగరంలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఇళ్ల స్థలాల సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనుంది. ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవాడలోని 24,057 పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ (హౌస్-సైట్ రెగ్యులరైజేషన్) పట్టాలను అందజేయనున్నారు. ముఖ్యమైన వివరాలు: ఇటీవల విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన పట్టాలు అందజేసిన తరహాలోనే, విజయవాడలోనూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఏపీకి మరోసారి భారీ వర్ష హెచ్చరిక!
మయన్మార్ – అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ విశేషాలు & హెచ్చరికలు:
కాకినాడలో భారీ వర్షాలు: జేసీబీపై వెళ్లి పరిశీలించిన అధికారులు
భారీ వర్షాల కారణంగా గాడేరు డ్రెయిన్ పొంగిపొర్లడంతో కాకినాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా 48, 49 డివిజన్లలోని ఇందిరమ్మ కాలనీతో పాటు అనేక ప్రాంతాలు గత మూడు రోజులుగా నీటి ముంపులోనే ఉన్నాయి. రహదారులు చెరువులను తలపిస్తుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడటంతో స్థానిక జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణ వాహనాలు వెళ్లలేని ఇందిరమ్మ కాలనీకి నగర కమిషనర్, తహసీల్దార్ సహా…
అభివృద్ధే మా అజెండా.. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం
25 ఎకరాల్లో త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ – మహాదేవపల్లిలో రూ.45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ పెనుకొండ, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత అన్నారు. ప్రజలతోనే కూటమి ప్రభుత్వం.. ప్రజల కోసమే పాలన సాగుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని…
మోడల్ కాలనీలో రూ.22 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ
హిందూపురం, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మోడల్ కాలనీలో రూ.22 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్, బీజేపీ హిందూపురం పట్టణ అధ్యక్షురాలు అంజలి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతినిధి సురేంద్ర, వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మాజీ చైర్మన్ డీఈ రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి,…
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ…
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు ముగియడం మరియు ఎస్ఎస్డీ (SSD) టోకెన్ల జారీ సాఫీగా సాగుతుండటంతో తిరుమలలో భక్తుల పెరుగుతోంది. శనివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి, భక్తులు వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. శుక్రవారం వివరాలు: క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, అల్పాహారం…
తుని రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురు యువకుల అరెస్ట్
కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, సీఐబీ అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో హౌరా–చెన్నై మెయిల్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల వద్ద చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని మనోజ్ ప్రధాన్ (27), శంభునాథ్ జనా (29), అజయ్ జనా (25)గా గుర్తించారు. నిందితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర మూడు ప్యాకెట్ల…
విశాఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చికెన్ పట్టివేత
విశాఖపట్నం బీచ్ రోడ్డులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో తీవ్ర అక్రమాలు బయటపడ్డాయి. ప్రముఖ కామత్ హోటల్లో దాదాపు 60 కిలోలు, పిస్తా హౌస్‌లో 30 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంటగదులు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ప్రజల…

