Andhra Pradesh
శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కన్వీనర్‌గా రాచర్ల రామకృష్ణ
చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి) శ్రీ సత్యసాయి జిల్లా మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ కన్వీనర్‌గా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జర్నలిస్టు రాచర్ల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎం.ఎస్.పి. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జి బాయకాటి బెనర్జీ ప్రకటించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో చెన్నేకొత్తపల్లి మండల ఎం.ఆర్.పి.ఎస్. అధ్యక్షులు అర్జునప్ప మాదిగ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాప్తాడు…
ఏపీకి వెదర్ అలర్ట్! వచ్చే 72 గంటల్లో వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మళ్లీ మారబోతోంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాగల మూడు రోజుల పాటు (నెక్స్ట్ 72 అవర్స్) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రాంతాల వారీగా…
సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి:విశాఖ
విశాఖపట్నం సముద్ర తీరానికి విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ప్రశాంత్ అనే విద్యార్థి మృతదేహం లభించగా, నేడు నితీష్, సూర్యల మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. పోలీసులు, గజ ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల అనంతరం ముగ్గురి మృతదేహాలు లభ్యం కావడంతో గాలింపునకు ముగింపు పలికారు. కళ్లముందే ముగ్గురు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి…
పవన్ కల్యాణ్:నేడు సమన్వయ కమిటీలతో కీలక భేటీ!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు పార్టీ కోఆర్డినేషన్ కమిటీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలాబలాలను సమీక్షించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల కార్యాచరణ, కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం, ప్రచార వ్యూహాలపై పార్టీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో గ్రామాలు,…
విజయవాడలో నేడు ‘పాన్‌ఐఐటీ ఏపీ సమ్మిట్–2026′!
ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో నేడు ‘పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026’ వైభవంగా జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దేశంలోని 23 ఐఐటీలకు చెందిన గ్లోబల్ అలుమ్ని నెట్‌వర్క్‌ను రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానించడం, పరిశ్రమలు-ప్రభుత్వం-ఐఐటీల భాగస్వామ్యంతో టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు, స్టార్టప్‌లు, పరిశోధనలను ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో అమరావతి పాన్‌ఐఐటీ కౌన్సిల్,…
ఏపీ నా సొంత రాష్ట్రంలాంటిది:అనంత్ అంబానీ!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. మదనపల్లెలో ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’, ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “నన్ను మీ ఆంధ్రా బిడ్డగా భావించి, రాష్ట్రానికి నేనేం చేయాలో మార్గనిర్దేశం చేయండి” అని సీఎం నారా చంద్రబాబు నాయుడిని వినమ్రంగా కోరారు. అనంత్ ప్రసంగానికి మంత్రముగ్ధులైన సీఎం చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్,…
మదనపల్లె హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన:సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్ శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ మరియు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అత్యాధునిక సాగు పద్ధతులు, పరిశోధనలు, మరియు ఉద్యాన పంటల…
రాయలసీమ: ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’కు నేడే శ్రీకారం
రాయలసీమను దేశంలోనే ప్రధాన ఫల దిగుబడి, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మదనపల్లెలో రూ.1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’కు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కింద 10 జిల్లాల్లోని 303 మండలాలు, 5,869 గ్రామాలను కలిపి 201 క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల…
పేదరిక నిర్మూలనే నా ధ్యేయం: బాపట్ల సభలో సీఎం
బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలను సవరించి పేద ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. తాను కూడా ఇతర నాయకుల్లా కార్యాలయానికే పరిమితమై బటన్లు నొక్కవచ్చని, కానీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికే ప్రతినెల వారి మధ్యకు వస్తున్నానని తెలిపారు. తమ…
రెండు రాష్ట్రాల్లో ‘చెడ్డీ గ్యాంగ్’ చోరీల కలకలం!
తెలుగు రాష్ట్రాల్లో ‘చెడ్డీ గ్యాంగ్’ల సంచారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లోకి చొరబడిన దుండగులు చోరీకి యత్నించడంతో పాటు, అడ్డుకున్న మహిళపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన మరవక ముందే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శివార్లలోనూ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. తిరుచానూరు పరిధిలోని కొత్తపాలెం ప్రాంతంలో అర్ధరాత్రి…

