Andhra Pradesh
ఏపీ స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్ల జీవో రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితికి తెరదించుతూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 104, 1065లను కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల శాతం 50 దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల కోటాను 50 శాతానికి లోబడి సమీక్షించి, ఆరు…
రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లా రేపల్లెలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘పేదల సేవ’ కార్యక్రమంలో భాగంగా రేపల్లెలోని 4వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు సీఎం స్వయంగా పింఛన్లను అందజేసి వారితో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పర్యటన ముగింపులో భాగంగా మధ్యాహ్నం రేపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో…
రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి
పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: ధర్మవరం ఆర్డీఓ ఓ. రామ భూపాల్ రెడ్డి చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులోగా అందించాలని ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఓ. రామ భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండల కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆర్డీఓ.. పెండింగ్ దరఖాస్తులు, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు,…
హార్టీకల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధి: మంత్రి సవిత
రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శ్రీకారం పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి పులివెందుల/కడప: సెప్టెంబర్ 30 (E6tv NEWS: ప్రతినిధి). రాయలసీమలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్‌తో ఉద్యానవన సాగులో ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో…
రమా నందన ఎమోషనల్ కామెంట్స్: సెప్టెంబర్ 7నాటి ఘటనపై..
‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా గుర్తింపు పొందిన యూట్యూబర్ రమా నందన పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. విదేశీ ఉద్యోగాలు, వీసాల పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెపై…
8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా నూతన బోరు
మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో పనులు ప్రారంభం 100 అడుగుల లోతులోనే నీటి లభ్యత.. 3 ఇంచుల మేర నీరు ధర్మవరం, సెప్టెంబర్ 29:(E6tv NEWS:ప్రతినిధి) ధర్మవరం పట్టణంలోని 8వ వార్డులో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా నూతన బోరు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. వార్డులో నెలకొన్న నీటి సమస్యను స్థానికులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల…
టెక్నాలజీయే భవిష్యత్తు,ఏఐ వినియోగంపై సీఎం చంద్రబాబు దృష్టి
ప్రజాదరణ పొందేలా సుపరిపాలన అందించడానికి సాంకేతికత, నాయకత్వం, నైపుణ్యాలు మరియు ఆవిష్కరణలను మేళవించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహించిన ‘మిషన్ కర్మయోగి’ దక్షిణ ప్రాంతీయ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన సాంకేతికతల ద్వారా భారతదేశ సమగ్ర అభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. నిరంతర శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం…
వివేకా హత్య కేసులో లబ్ధిదారుడు జగనే: మంత్రి అనగాని
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ విచారణలు ముమ్మరం కావడంతో భయపడి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ధర్నాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సొంత బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే గుండెపోటుగా చిత్రీకరించే యత్నం చేశారని, రూ.40 కోట్ల సుపారీ…
రంగంలోకి ఈడీ: వివేకా కేసులో ఆర్థిక లావాదేవీలపై ఆరా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తీవ్ర ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (A-1) తో పాటు ఉమాశంకర్ రెడ్డి (A-3) ని ఈడీ అధికారులు హైదరాబాద్ కార్యాలయంలో రెండో రోజు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. హత్య వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంలో ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ కేసులో రూ.40 కోట్ల భారీ సుపారీ ఒప్పందం జరిగిందన్న సీబీఐ…
‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలో ‘మిషన్ కర్మయోగి’ దక్షిణ ప్రాంతీయ రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో పరిపాలనా నైపుణ్యాలు పెంపొందించడం, సామర్థ్య పెంపుదల (Capacity Building) లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో అమలువుతున్న ఉత్తమ పాలనా విధానాలను, సంక్షేమ కార్యక్రమాలను…

